Kishan Reddy: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల భాజపా ఇన్‌ఛార్జిగా కిషన్‌రెడ్డి

మరికొన్ని నెలల్లో జరిగే మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా నాయకత్వం ఇన్‌ఛార్జిలను, సహ ఇన్‌ఛార్జిలను నియమించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి జమ్మూకశ్మీర్‌ బాధ్యతలను అప్పగించింది.

Published : 18 Jun 2024 02:59 IST

ఈనాడు, దిల్లీ: మరికొన్ని నెలల్లో జరిగే మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా నాయకత్వం ఇన్‌ఛార్జిలను, సహ ఇన్‌ఛార్జిలను నియమించింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డికి జమ్మూకశ్మీర్‌ బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్రకు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్‌ (ఇన్‌ఛార్జి), అశ్వినీ వైష్ణవ్‌ (సహ ఇన్‌ఛార్జి); హరియాణాకు ధర్మేంద్ర ప్రధాన్‌ (ఇన్‌ఛార్జి), త్రిపుర మాజీ సీఎం విప్లవ్‌కుమార్‌ దేవ్‌(సహ ఇన్‌ఛార్జి); ఝార్ఖండ్‌కు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (ఇన్‌ఛార్జి), అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (సహ ఇన్‌ఛార్జి)లకు పార్టీ తరఫున పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌లలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబరులోగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.   

21 నుంచి బొగ్గు గనుల వేలం

దేశంలోని 62 వాణిజ్య బొగ్గు గనుల 10వ విడత వేలాన్ని ఈనెల 21 నుంచి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. 2047 నాటికి బొగ్గు రంగంలో ఆత్మ నిర్భరత సాధించాలన్న ప్రధాన మంత్రి మోదీ నిర్దేశాన్ని చేరుకోవడం కోసం ఈ వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్స్‌లో సోమవారం ఆయన వెల్లడించారు. బొగ్గుశాఖ ఇప్పటివరకూ 256 మిలియన్‌ టన్నుల గరిష్ఠ సామర్థ్యంగల 107 బొగ్గు గనులను విజయవంతంగా వేలం వేసినట్లు పేర్కొన్నారు. అందులో 11 బ్లాక్‌లలో కార్యకలాపాలు మొదలయ్యాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు