Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్‌ కుట్ర: కిషన్‌రెడ్డి

తెలంగాణలో 9 ఏళ్లుగా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు.

Updated : 24 Sep 2023 15:03 IST

హైదరాబాద్‌: తెలంగాణలో 9 ఏళ్లుగా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో టీఎస్‌పీఎస్సీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగులు అప్పులు చేసి కోచింగ్‌ తీసుకుంటున్నారన్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

అక్టోబర్‌ 1న తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. బేగంపేటలో సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ సంస్థకు ఆయన శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం పాలమూరు నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని