kishan reddy: రాజకీయ వ్యవహారాల కమిటీలో కిషన్‌రెడ్డి

దేశంలో భద్రత, ఆర్థిక, రాజకీయాలతో పాటు పలు వ్యవహారాల పరిశీలనకు మోదీ ప్రభుత్వం 8 క్యాబినెట్‌ కమిటీలను బుధవారం ఏర్పాటు చేసింది.

Published : 04 Jul 2024 03:57 IST

రెండు కమిటీల్లో రామ్మోహన్‌నాయుడు

ఈనాడు, దిల్లీ: దేశంలో భద్రత, ఆర్థిక, రాజకీయాలతో పాటు పలు వ్యవహారాల పరిశీలనకు మోదీ ప్రభుత్వం 8 క్యాబినెట్‌ కమిటీలను బుధవారం ఏర్పాటు చేసింది. ఇందులో రాజకీయ వ్యవహారాల కమిటీలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సభ్యుడిగా ఉన్నారు.  పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీల్లో సభ్యుడిగా తెదేపాకు చెందిన కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు నియమితులయ్యారు. వివిధ వ్యవహారాల పరిశీలనకు 8 మంత్రివర్గ ఉపసంఘాలను నియమించగా నియామకాలు, ఆర్థిక, రాజకీయ వ్యవహారాలు, భద్రత, పెట్టుబడులు, ఉపాధికల్పన కమిటీలకు ప్రధాని నేతృత్వం వహిస్తారు. నివాస వ్యవహారాల కమిటీకి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి రాజ్‌నాథ్‌సింగ్‌లు నేతృత్వం వహిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని