Agnipath Scheme: కాంగ్రెస్ హయాంలోనే ‘అగ్నిపథ్’కు బీజం: కిషన్‌ రెడ్డి

సైన్యంలో సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ (Agnipath Scheme) పథకంపై అనవసరంగా రాజకీయం చేయొద్దని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Published : 21 Jun 2022 01:46 IST

హైదరాబాద్‌: సైన్యంలో సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ (Agnipath Scheme) పథకంపై అనవసరంగా రాజకీయం చేయొద్దని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘అగ్నిపథ్’తో దేశానికి మంచే తప్పా.. ఎవరికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1999లో ‘అగ్నిపథ్’కు బీజం పడిందని తెలిపారు. అగ్నివీరులుగా ఒక్కసారి పనిచేస్తే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని, తద్వారా సైన్యం నుంచి బయటికి వచ్చాక బిజినెస్‌, ఉద్యోగాల్లోనూ మేటిగా రాణించవచ్చని పేర్కొన్నారు. ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కిషన్‌ రెడ్డి ఈ మేరకు మరోసారి స్పందించారు.

‘‘సైన్యంలో పనిచేయాలని చాలా మంది ఆశతో ఉన్నారు. అలాంటి వారు ‘అగ్నిపథ్‌’లో చేరవచ్చు. అగ్నివీరులుగా చేరి.. బయటకు వచ్చిన తర్వాత ఎందులో చేరడానికైనా ఆ నైపుణ్యాలు ఉపయోగపడతాయన్నారు. బయటికి వెళ్లాక అనేక విద్య, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మహీంద్ర లాంటి కంపెనీలు సైతం అగ్నివీరులందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ప్రతిఒక్కరూ ‘అగ్నిపథ్‌’కు సహకరించాలి’’ అని కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని