Published : 14/11/2021 01:09 IST

TS News: వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా?: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేసే బదులు ఉద్యోగాల భర్తీ, ఆయుష్మాన్‌ భారత్‌, ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణీపై దృష్టి పెట్టాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వకుండా ఒక్క హుజూరాబాద్‌కే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

‘‘తెలంగాణలో ఏ రైతు అయినా బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తి చేస్తున్నారా? బాయిల్డ్‌ రైస్‌ అనేది రైస్‌ మిల్లర్ల సమస్య. దశలవారీగా బాయిల్డ్‌ రైస్‌ తగ్గించాలని కేంద్రం చెబుతూ వచ్చింది. రైస్‌ మిల్లర్లతో మాట్లాడకుండా రైతులను, కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేస్తోంది. ధర్నా చౌక్‌ వద్దు అన్న వాళ్లే ధర్నా చేశారు. మంత్రులు కూడా ధర్నా చేయడం చాలా సంతోషం. మంత్రులు ధర్నా చేసి నాకు ఆదర్శంగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించడానికి నోరెలా వచ్చింది. అబద్దాల ప్రచారం మీద ప్రభుత్వాలు నడపొద్దు. మోదీ ప్రభుత్వం ఎక్కడా అప్పులు చేసి కమీషన్లు తీసుకోలేదు. రామప్పకు యునెస్కో గుర్తింపు తేవడానికి కేంద్రం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. ప్రగతి భవన్‌లో పడుకొని 19 దేశాలను ఒప్పించావా కేసీఆర్‌.  వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్రాలను ప్రతిపాదనలు కోరాం. మెడికల్‌ కాలేజీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కేంద్రం ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని తెరాస అంటోంది.. బీబీ నగర్‌ ఎయిమ్స్‌ తెలంగాణలో లేదా? ఇప్పటికైనా పంతాలు.. పట్టింపులు మాని  రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్‌కు భవనాలు అప్పగించాలి.

నవంబర్‌ 15న గిరిజన దినోత్సవం

బిర్సాముండా జయంతి రోజు నవంబరు 15న జాతీయ గిరిజన దినోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అల్లూరి, కుమురం భీం పోరాటాలకు సరైన గుర్తింపు దక్కలేదు. రాష్ట్రంలో ట్రైబల్‌ మ్యూజియానికి రూ.15కోట్లు ఇస్తున్నాం. ట్రైబల్‌ మ్యూజియానికి ఇప్పటికే రూ.కోటి విడుదల చేశాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క.. సారలమ్మ జాతరకు కేంద్రం నిధులు ఇస్తుంది. జాతరలో కేంద్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తాం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. 


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని