Kishan Reddy: తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో దూకుడు పెంచాలి: కిషన్‌రెడ్డి

చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. భాజపాపై చేస్తున్న తప్పుడు  ప్రచారాన్ని తిప్పికొట్టడంలో దూకుడుగా వ్యవహరించాలన్నారు.

Published : 21 Nov 2022 02:30 IST

హైదరాబాద్‌: ప్రపంచంలో అతిపెద్ద  సభ్యత్వం కలిగిన పార్టీ భాజపా అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. శామీర్‌పేటలో 3 రోజుల పాటు జరగనున్న భాజపా శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. 

‘‘భాజపాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ విపక్ష పార్టీపై విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో చేసిన పనులు చెప్పుకోలేక తెరాస తప్పుడు ప్రచారం చేస్తోంది. సంక్షేమ పథకాలు అపుతామని బెదిరించి మునుగోడులో తెరాస గెలిచింది. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో పార్టీ శ్రేణులంతా దూకుడుగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలి’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌,  రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, పార్టీ ఎమ్మెల్యేలు, కార్యదర్శులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని