Kishan Reddy: తెలంగాణకు రావాలంటే కల్వకుంట్ల కుటుంబం పర్మిషన్‌ కావాలా?: కిషన్‌రెడ్డి

వందల మంది ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందని.. రాష్ట్రానికి రావాలంటే కల్వకుంట్ల కుటుంబం అనుమతి కావాలా? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated : 14 May 2022 20:14 IST

హైదరాబాద్‌: వందల మంది ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందని.. రాష్ట్రానికి రావాలంటే కల్వకుంట్ల కుటుంబం అనుమతి కావాలా? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెరాస వైఫల్యాలు ప్రజలకు తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు. తుక్కుగూడలో నిర్వహించిన భాజపా బహిరంగసభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.

‘‘అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వద్దని సీఎం కేసీఆర్‌ వద్దంటున్నారు. సొంత రాజ్యాంగం రాసుకుని కుమారుడిని సీఎం చేసుకోవాలని చూస్తున్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చాం. రెండున్నరేళ్లుగా పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. తెలంగాణను కేసీఆర్‌ కుటుంబానికి రాసిచ్చారా? భాజపా నేతలు రాష్ట్రంలో ఎందుకు తిరగకూడదు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్‌ ఎందుకు చేయలేదు?ఎస్సీలకు మూడెకరాల భూమి ఇచ్చారా? ఎంతమందికి దళితబంధు ఇచ్చారు?రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్న హామీ ఏమైంది?ఎస్టీల రిజర్వేషన్లు పెరగకపోవడానికి కారణం కేసీఆర్‌. ఎస్టీ రిజర్వేషన్లు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని ఆయన చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని