Updated : 26 May 2022 19:05 IST

Kodali Nani: అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలి: కొడాలి నాని

గుడివాడ: ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లు చదువుతూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  చిన్నపిల్లలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. రాజ్యాంగంపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు.

కృష్ణా జిల్లా గుడివాడలో ‘గడప గడపకూ ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలో కొడాలి నాని మాట్లాడారు.  డా.బీ.ఆర్‌. అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలని.. అలాంటి వాళ్లను జైల్లో పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రాధాన్యమని.. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు కాదని చెప్పారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్‌ అని.. అది కూడా తెలియకుండా పవన్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని