Andhra News: హరికృష్ణను ఓడించింది కొడాలి నానియే: రావి
గుడివాడలో నందమూరి హరికృష్ణను చిత్తుగా ఓడించింది కొడాలి నాని కాదా అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రావి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు.
గుడివాడ, న్యూస్‌టుడే: గుడివాడలో నందమూరి హరికృష్ణను చిత్తుగా ఓడించింది కొడాలి నాని కాదా అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు రావి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణాజిల్లా గుడివాడలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాని మీదున్న నమ్మకంతో హరికృష్ణ గంట గుర్తుపై గుడివాడలో పోటీ చేస్తే, ఓడించిన ఘనత నానికే దక్కుతుందన్నారు. తన నియోజకవర్గంలో హరికృష్ణ పోటీ చేయడాన్ని జీర్ణించుకోలేని కొడాలి తన కార్యకర్తలతో హరికృష్ణను ఓడించినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి వెన్నుపోటు మనస్తత్వం ఉన్న ఆయన.. ఇప్పుడు నీతి కబుర్లు చెప్పడం సిగ్గుచేటన్నారు. కోవర్టు రాజకీయాలు చేసే ఆయనకు గుడివాడ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఆయన చేసే తప్పులన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని, ఆ రోజు తప్పక జైలుకి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
APMDC: ఏపీలో బీచ్‌శాండ్ మైనింగ్‌కు టెండర్లు.. రూ.వెయ్యికోట్ల ఆదాయమే లక్ష్యం
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా