21న చలో అసెంబ్లీ: కోదండరామ్‌

స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ఏపీ ప్రభుత్వం మాదిరిగా ఒక చట్టం చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు....

Published : 12 Sep 2020 13:06 IST

హైదరాబాద్‌: స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా ఏపీ ప్రభుత్వం మాదిరిగా ఒక చట్టం చేయాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 21న ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చినట్టు  తెలిపారు.  రాష్ట్రంలో దాదాపు 1.48లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొత్త జిల్లాలు, కొత్త మండల్లో  దాదాపు 50,000కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లు అయినా నిరుద్యోగయాత్ర చేయాల్సి రావడం దారుణమన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని, ప్రైవేటు ఉద్యోగులకు సాయం చేయాలని డిమాండ్‌ చేశారు.  సాదాబైనామాలు, పోడు భూములు, అసైన్డ్‌ భూములు, కౌలు రైతుల సమస్యలపై రెవెన్యూ చట్టంలో స్పష్టత లేదన్నారు. నూతన రెవెన్యూ చట్టంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సూచించారు. 

స్వామి అగ్నివేశ్‌ మృతికి సంతాపం
సామాజిక ఉద్యమకారుడు, ఆర్య సమాజ్‌ నేత స్వామి అగ్నివేశ్‌ మృతికి కోదండరామ్‌ సంతాపం తెలిపారు. అగ్నివేశ్‌ చనిపోవడం ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని