Andhra news: కోడెలపై పెట్టిన కేసు జగన్ మీద కూడా పెట్టొచ్చు కదా!: శివరాం

ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌ను సొంతానికి వినియోగించుకుంటున్న మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు చేయాలని కోడెల శివరాం ఓ ప్రకటనలో కోరారు.

Updated : 15 Jun 2024 19:22 IST

అమరావతి: ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌ను సొంతానికి వినియోగించుకుంటున్న మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు చేయాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం ఓ ప్రకటనలో కోరారు. ‘‘మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఆరోజు ఫర్నిచర్‌ తన వద్ద ఉందని చెప్పకపోతే ఎవరికీ తెలియదు. ఫర్నిచర్‌ తీసుకెళ్లాలని స్పీకర్‌కు లేఖ రాసిన తర్వాత ఆయనపై కేసు పెట్టారు. అప్పటి నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఐపీసీ 409 సెక్షన్‌ కింద పదేళ్లు శిక్షపడే కేసు పెట్టారు. అదే జగన్‌ నేడు.. తాడేపల్లి, లోటస్‌పాండ్‌లో ఇళ్ల మరమ్మతుల కోసం రూ.18 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలను కలవటానికి చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రజావేదిక కూల్చి వేశారు. ప్రస్తుతం జగన్‌ తన నివాసంలో సీఎంవో కింద తెచ్చిన ఫర్నిచర్‌ ఇచ్చేస్తానని కనీసం లేఖ రాయలేదు. ఇప్పటిదాక ఫర్నిచర్‌ ఇవ్వనందుకు కోడెలపై పెట్టిన కేసే జగన్‌ మీద పెట్టొచ్చు కదా!’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని