Andhra news: గృహనిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొలుసు పార్థసారధి

గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రిగా కొలుసు పార్థ సారధి సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించారు. 

Published : 14 Jun 2024 21:10 IST

అమరావతి: గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రిగా కొలుసు పార్థ సారధి సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో బాధ్యతలు స్వీకరించారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నరేంద్రమోదీకి ధన్యవాదలు తెలిపారు. గృహనిర్మాణ, సమాచారశాఖ అప్పగించడం సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి, పూర్తయిన వాటికి చాలా అంతరం ఉందని తెలిపారు. కేంద్ర పథకాలు, అమృత్‌ పథకాలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద గృహ నిర్మాణశాఖకు నిధులు తెచ్చుకోగలమని పేర్కొన్నారు. వివిధ రకాల సమస్యలతో ఈ శాఖ కుంటుపడిందని, ఇకపై అన్ని అంశాలను సమీక్ష చేసి లబ్ధిదారులకు న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని