Kolusu Parthasarathy: జగనన్న కాలనీలకు నిధులన్నీ కేంద్రానివే: మంత్రి కొలుసు పార్థసారథి

జగన్ ప్రభుత్వంలో  పథకాలు అన్ని నేతి బీరకాయ తరహాలోనే అమలు అయ్యాయని మంత్రి కొలుసు పార్దసారథి అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 19 Jun 2024 14:28 IST

అమరావతి: జగన్ ప్రభుత్వంలో పథకాలన్నీ నేతి బీరకాయ తరహాలోనే అమలయ్యాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో 26 లక్షల ఇళ్లలో కేవలం 6 లక్షలు మాత్రమే నిర్మించారని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు అని చెప్పి సగం సగం పనులు చేశారని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో గృహ నిర్మాణంలో రాష్ట్రం అధమ స్థానంలో నిలిచిందన్నారు. 

‘‘వైకాపా ప్రభుత్వం యూనిట్ కాస్ట్‌ను కూడా తగ్గించింది. లబ్ధిదారులకు రూ.945 కోట్ల మేర బిల్లులను కూడా ఎగ్గొట్టారు. గృహ నిర్మాణ శాఖకు ఇవ్వాల్సిన రూ.3,070 కోట్ల మేర నిధులు కూడా గత ప్రభుత్వం మళ్లించింది. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తెదేపా ప్రభుత్వం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దారి మళ్లించడంతో పాటు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. గడిచిన ఐదేళ్లలో పశ్చిమ బెంగాల్‌లో 45 లక్షల ఇళ్లు నిర్మించారు. ఏపీలో కేవలం 6.08 లక్షల ఇళ్లు మాత్రమే కట్టగలిగారు. లే అవుట్లలో సదుపాయాల కొరత ఉంది. మళ్లించిన నిధులు దేనికి వాడారన్నది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలింది. ఆ నిధులు రుషికొండ ప్యాలెస్‌కు మళ్లించారా? లేదా ఇతర అంశాలకా? అన్నది తేలుస్తాం. గత ప్రభుత్వం లబ్ధిదారుల పేరిట రుణాలు తీసుకుంది. జగనన్న కాలనీల్లోనూ రాష్ట్ర వాటా నిధుల్లేవు.. అన్నీ కేంద్రానివే’’ అని కొలుసు పార్థసారథి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని