Telangana news: అవినీతిని ప్రశ్నిస్తే.. నన్ను కాంట్రాక్టర్‌ అంటున్నారు: కోమటిరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా తలపడలేక

Updated : 14 Mar 2022 18:28 IST

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా తలపడలేక తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అసెంబ్లీలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వడంలేదు. అవినీతిపై ప్రశ్నిస్తుంటే.. కాంట్రాక్టర్‌ అంటున్నారు. కాంట్రాక్టర్‌గా ఉండటం తప్పా..అది తప్పుడు వ్యాపారమా?కాంట్రాక్టులు అడ్డుకున్నా.. అధికార పార్టీకి లొంగలేదు. లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు రూ.లక్షల కోట్లు ఇచ్చి కమీషన్లు దోచుకుంటున్నారు. సింగరేణిలో 20వేల కోట్ల అవినీతి జరిగింది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారు. ప్రజలే ఆలోచించి కుటుంబ పాలనను అంతమొందించాలి’ అని విజ్ఞప్తిచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని