Telangana news: భట్టి విక్రమార్క అందుకే నన్ను కలిశారు: కోమటిరెడ్డి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనతో ప్రత్యేకంగా మాట్లాడటానికే...
హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ ముగిసింది. అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనతో ప్రత్యేకంగా మాట్లాడటానికే భట్టి వచ్చారన్నారు. కాంగ్రెస్‌కు దూరమవుతాననే ఆలోచనతోనే కలిసి పనిచేయాలని కోరేందుకు ఆయన తనను కలిశారన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా కాంగ్రెస్ అధిష్ఠానం పట్టించుకోలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో భాజపా బలం పుంజుకుంటుందని తాను చెప్పానని.. అలాగే జరుగుతోందని అన్నారు. మునుగోడు ప్రజల అభిప్రాయ సేకరణ ప్రకారమే నిర్ణయం తీసుకుంటానని స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ ప్రజలతో సమావేశమవుతానన్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి లేదన్నారు.
కాంగ్రెస్‌లో ఉంటారనే అనుకొంటున్నా.. భట్టి
కాంగ్రెస్ ఆలోచనలతోనే తెలంగాణకు మేలు జరుగుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. కోమటిరెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యల గురించి ఆయన్ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆయనేం చెప్పారో నాకు తెలియదు. వినలేదు’’ అని సమాధానం దాటవేశారు. పార్టీ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేద్దామని ఆయనకు సూచించానన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసేనని.. ఆ పార్టీతోనే రాష్ట్ర ప్రజల లక్ష్యాలు అవసరాలు తీరతాయని భట్టి అన్నారు. ‘‘సోనియా, రాహుల్‌పై రాజగోపాల్‌రెడ్డికి చాలా గౌరవం ఉంది. కేసీఆర్‌పై సీరియస్‌గా కొట్లాడుదామని నాతో అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుంది. పదవులు చాలా మంది కోరుకుంటారు.. కానీ కొందరికే వస్తాయి. ప్రజల లక్ష్యాల కోసం పనిచేద్దామని రాజగోపాల్‌తో చెప్పా. రాజగోపాల్ మా ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడేందుకు వచ్చా. ఆయన పార్టీ నుంచి వెళ్తారని నేను భావించడం లేదు’’ అని భట్టి వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందులో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క రాజగోపాల్ రెడ్డితో భేటీ అయి గంటల పాటు ఆయనతో చర్చించారు. తెరాసను ఓడించే శక్తి భాజపాకే ఉందని నిన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అధిష్ఠానం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కాంగ్రెస్ బలహీనపడిందని.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణలో చట్టం తనపని తాను చేస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్‌గా ఉంది. దీంతో ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను తెప్పించుకొని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్ ఆరా తీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Australia: కనిపించకుండాపోయిన ‘రేడియోధార్మిక’ క్యాప్సూల్.. 1400 కి.మీల మేర వెతుకులాట!
-
India News
PM Modi: అదే మా నినాదం.. అభివృద్ధి మంత్రం: మోదీ
-
General News
Viveka Murder case: మళ్లీ పిలుస్తామన్నారు.. సీబీఐ విచారణకు సహకరిస్తా: అవినాష్‌రెడ్డి
-
India News
Mughal Gardens: మొఘల్ గార్డెన్స్.. ఇక ‘అమృత్ ఉద్యాన్’