Konda Vishweshwar Reddy: నెలకు ఒక్క లీడర్‌నైనా భాజపాలోకి తీసుకొస్తా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టేందుకు అవకాశం లేదని మాజీ ఎంపీ, భాజపా నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇతర పార్టీలకు

Published : 06 Jul 2022 15:00 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టేందుకు అవకాశం లేదని మాజీ ఎంపీ, భాజపా నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇతర పార్టీలకు తెరాసను ఢీకొట్టే సత్తా లేదని.. కేసీఆర్‌ను అడ్డుకోవడం భాజపాకే సాధ్యమని చెప్పారు. ఇటీవల భాజపాలో చేరిన విశ్వేశ్వర్‌రెడ్డి.. చేరికలపై ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి సన్మానించారు. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

‘‘నేను ఇన్ని రోజులు తటస్థంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. భాజపాలో చేరే సరికి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. కాంగ్రెస్‌లోని సీనియర్‌ నేతలకు కూడా నేను భాజపాలో చేరుతున్న విషయం తెలుసు. భాజపాలో సరైన కమిటీలో నాకు అవకాశం కల్పించారు. నెలకి ఒక్క లీడర్‌ను అయినా పార్టీలోకి తీసుకొస్తా’’ అని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని