MLA Sanjay: ప్రాణమున్నంత వరకూ భారాసలోనే..

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి, పాలనను పక్కనబెట్టి కేవలం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపైనే దృష్టి కేంద్రీకరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు.

Published : 25 Jun 2024 04:02 IST

కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్‌

కోరుట్ల, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి, పాలనను పక్కనబెట్టి కేవలం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపైనే దృష్టి కేంద్రీకరించిందని కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. సోమవారం కోరుట్ల క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు భారాస ఎమ్మెల్యేలు డబ్బు, అధికారం, మంత్రి పదవుల కోసం పార్టీ మారుతున్నారని, తాను కూడా పార్టీ మారుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రాణమున్నంత వరకు భారాసలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే విజయానికి ఎమ్మెల్సీ కవిత ఎంతో శ్రమించారని, వాటన్నింటినీ మర్చిపోయి తన స్వార్థం కోసం పార్టీ మారడంపై మండిపడ్డారు. 

  • ఓ పార్టీ నుంచి ఎన్నికైన వారు మరో పార్టీలోకి వెళ్తే తక్షణం అనర్హుడిగా ప్రకటించాలని మ్యానిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్‌.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఎమ్మెల్సీ ఎల్‌.రమణ విమర్శించారు. తెలంగాణభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరడం అనైతికమని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. 
  • మాజీ ఎమ్మెల్యే పుట్టా మధూకర్‌ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్‌బాబు అండతో మంథని నియోజకవర్గంలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని విమర్శించారు. తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మైనింగ్‌ ప్రమాణాలు పాటించకుండా మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని