Kotamreddy: అమరావతి రైతులను పరామర్శించడమే నేను చేసిన నేరమా?: కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ పరిధిలోని 21డివిజన్ లో కోటంరెడ్డి తొలి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

Published : 07 Feb 2023 23:59 IST

నెల్లూరు: అధికార పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, అమరావతి రైతులను పరామర్శించడమే నేను చేసిన నేరమా? అని నెల్లూరు గ్రామీణ వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. రోడ్లు వేయాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, జగనన్న లేఅవుట్లలో సౌకర్యాలను మెరుగుపర్చాలని పలుమార్లు అధికారులను ప్రశ్నించానని తెలిపారు. ఈ విషయంపై తన మిత్రుడు ఫోన్‌ చేసి ముఖ్యమంత్రికి కావల్సిన అధికారులను ఎందుకు ప్రశ్నిస్తున్నావని అడగడంతో తాను సమాధానం ఇచ్చానన్నారు. ఈ సంభాషణ దొంగచాటుగా వినాల్సిన అవసరం ఏమొచ్చింది? అవమానించినచోట ఉండకూడదని బయటకు వచ్చానని శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. 

నెల్లూరు రూరల్ పరిధిలోని 21డివిజన్ లో కోటంరెడ్డి తొలి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి  నామినేషన్‌కు ముందు రోజు వైకాపా కండువా వేసుకున్న ఆయన్ను ఇప్పుడు ఇన్‌ఛార్జిగా నియమించారని విమర్శించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తాళి కట్టే సమయంలో పారిపోయిన వ్యక్తి ఆదాల అని ఆయన దుయ్యబట్టారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డిలా రాజకీయ డ్రామాలు చేయడం తనకు చేతకాదన్నారు. రూ.100, 200, 300 కోట్లు పెట్టి కోటంరెడ్డి సంగతి తేలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్న వారు ఇది రూరల్‌ నియోజకవర్గమని గుర్తుంచుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని