KTR: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాజపాకు కాంగ్రెస్‌ సహకారం: కేటీఆర్‌

సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చూసి తన సమాధిలో గోబెల్స్‌ ఉలిక్కిపడ్డారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Updated : 22 Jun 2024 13:36 IST

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చూసి తన సమాధిలో గోబెల్స్‌ ఉలిక్కిపడ్డారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్‌, భాజపా యత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల అమ్మకాలను భారాస వ్యతిరేకించిందన్నారు. 

‘‘మీ ప్రభుత్వంలో మాదిరిగా మా ప్రభుత్వం నుంచి ఎవరూ వేలంలో పాల్గొనలేదు. చివరి రౌండ్‌లో 2 బ్లాకులను కేంద్రం ఏకపక్షంగా వేలం వేసింది. తెలంగాణ ఆస్తులు, హక్కులు, వనరులు తాకట్టు పెట్టే యత్నం చేస్తున్నారు. ఆస్తులు తాకట్టు పెట్టే నేరాల్లో కాంగ్రెస్‌, భాజపా భాగస్వాములు. రాష్ట్ర నదీ ప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్‌ విఫలమైంది. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో భాజపాకు కాంగ్రెస్‌ సహకారం అందించింది. అన్ని రంగాలకు ద్రోహం చేస్తున్న పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారు’’ అని కేటీఆర్‌ విమర్శించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని