KTR: విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరు?: కేటీఆర్‌

ఆనాటి కాంగ్రెస్‌ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు ఉండేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Published : 10 Jul 2024 13:48 IST

హైదరాబాద్‌: ఆనాటి కాంగ్రెస్‌ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు ఉండేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. నేడు బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుక తిరిగే చట్నీలు ఉంటున్నాయన్నారు. మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి అని పెద్ద మార్పే తెచ్చారని ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఎద్దేవా చేశారు. 

భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతమైందని చెప్పారు. కోమటిపల్లి హాస్టల్‌లో ఉప్మాలో బల్లిపడి 20 మంది విద్యార్థులకు వాంతులయ్యాయన్నారు. సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక కనిపించడంతో విద్యార్థులు బెంబేలయ్యారని తెలిపారు. విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరని ప్రశ్నించారు. అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు అవస్థలని ఆరోపించారు. ఇకనైనా కాంగ్రెస్‌ సర్కారు కళ్లు తెరవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని