KTR: అప్పట్లో కాంగ్రెస్‌ తలవంచక తప్పలేదు.. చరిత్ర పునరావృతం అవుతుంది: కేటీఆర్‌

అధికారంలో ఉన్న వారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Published : 24 Jun 2024 11:54 IST

హైదరాబాద్‌: అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న తరుణంలో ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్పందించారు. 2004-06 మధ్య కూడా తమ పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయని గుర్తుచేశారు. అనంతరం ప్రజాఉద్యమం ఉద్ధృతం కావడంతో తెలంగాణ గట్టిగా ప్రతిస్పందించిందని తెలిపారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ తలవంచక తప్పలేదని చెప్పారు. రానున్న రోజుల్లో చరిత్ర పునరావృతం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని