KTR: దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి మాపై విమర్శలా?: కేటీఆర్‌

దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు,

Updated : 06 May 2022 13:46 IST

హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెరాస పాలనపై మహబూబ్‌నగర్‌ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. 

మోదీ పాలనలో నిరుద్యోగం 45ఏళ్ల గరిష్ఠానికి చేరిందని కేటీఆర్‌ విమర్శించారు. గత 30ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లోనే వంట గ్యాస్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆక్షేపించారు. దేశానికి, రాష్ట్రానికి ఏమీ చేయని భాజపా నేతలు తెలంగాణకు వచ్చి తెరాస పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని కేటీఆర్‌ మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని