KTR: ఆధారాలుంటే పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టు.. లేదంటే సారీ చెప్పు: బండి సంజయ్‌పై కేటీఆర్‌ ఫైర్‌

ప్రజాసంగ్రామ యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

Published : 13 May 2022 02:22 IST

హైదరాబాద్‌: ప్రజాసంగ్రామ యాత్రలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్‌ నిర్వాకమే కారణమని.. దీనిపై సీఎం కేసీఆర్‌ కనీసం స్పందించలేదని బండి సంజయ్‌ ఆరోపించారు. సంజయ్‌ ఆరోపణలపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

హాస్యాస్పదమైన, ఆధార రహితమైన, బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను బండి సంజయ్‌ ఆపకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని కేటీఆర్‌ హెచ్చరించారు. ఏమైనా ఆధారాలుంటే నిరూపించాలని సవాల్‌ విసిరారు. ఆధారాలను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని.. ప్రచారం కోసం వాక్చాతుర్యం ప్రదర్శించవద్దన్నారు. లేకపోతే ప్రజలకు బండి సంజయ్‌ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

మోదీజీ.. తెలంగాణపై అంత వివక్ష ఎందుకు?

మరో ట్వీట్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ జీ.. మీరు గుజరాత్‌కే కాదు భారత్‌కు కూడా ప్రధానే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 8ఏళ్లుగా రాష్ట్రానికి ఒక్క వైద్యకళాశాల కూడా ఇవ్వలేదని.. కేంద్రం చర్యలతో వైద్యవిద్యకు దూరమయ్యే యువత పరిస్థితి ఏంటని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణపై ఇంత వివక్ష ఎందుకని ట్విటర్‌ వేదికగా ఆయన నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని