KTR: మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్‌

భాజపా పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్‌ చేసిన వారిని అరెస్ట్‌ చేస్తున్నారని.. తెలంగాణ మాత్రం ఏకంగా సీఎం, మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 22 Mar 2023 15:57 IST

హైదరాబాద్‌: భాజపా పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్‌ చేసిన వారిని అరెస్ట్‌ చేస్తున్నారని.. తెలంగాణలో మాత్రం ఏకంగా సీఎం, మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

పరుష పదాలతో ట్వీట్‌ చేసినందుకు భాజపా పాలిత రాష్ట్రం కర్ణాటకలో కన్నడ నటుడు చేతన్‌ను అరెస్ట్‌ చేసిన విషయాన్ని కేటీఆర్‌ తన ట్విటర్‌లో ప్రస్తావించారు. తెలంగాణలోనూ అదే తరహాలో సమాధానం ఇవ్వాలేమోనని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మీరేమంటారు? అంటూ ప్రజలను ఉద్దేశించి కేటీఆర్‌ ప్రశ్నించారు. భావ ప్రకటనా స్వేచ్ఛ.. దూషించే స్వేచ్ఛ కాకూడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ చేరుకున్న కవిత, మంత్రులు

భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణకు హాజరైన ఆమె.. బుధవారం ఉదయం మధ్యాహ్నం నగరానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కవిత.. నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. ఆమెతోపాటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, పలువురు నేతలు కూడా హైదరాబాద్‌ చేరుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు