KTR: కేసీఆర్‌.. మోదీ పరిపాలనకు బేరీజు వేయండి: మంత్రి కేటీఆర్‌

ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలన, మోదీ పరిపాలనకు బేరీజు వేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా

Published : 30 Jun 2022 17:35 IST

హైదరాబాద్‌: ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలన, మోదీ పరిపాలనకు బేరీజు వేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భాజపా నేతలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.  మేం చేసిన అభివృద్ధి పనులు వంద చెబుతాం... తెలంగాణలో కేంద్రం చేసిన మంచి పని ఒక్కటి చెప్పాలని సవాల్‌ విసిరారు. 

‘‘ప్రపంచానికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రంగా హైదరాబాద్‌ నిలిచింది. టూరిస్టులు వస్తారు.. రెండ్రోజులు లొల్లిపెట్టి పోతారు. వాళ్లకు తెలిసిందల్లా అబద్దాలు చెప్పడమే. దేశంలో 20 టాప్‌ 20 గ్రామాలు ప్రకటిస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయి. మోదీ  తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి? గ్యాస్‌ సిలిండర్‌  ధర రూ.400 ఉన్నప్పుడు మోదీ గగ్గోలు పెట్టారు. సామాన్యులు ఎలా బతకాలని నిలదీశారు. చేతగాకపోతే దద్దమ్మ ప్రధాని దిగిపోవాలని అప్పట్లో విమర్శించారు. కానీ, ఇప్పుడు మోదీ హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,050కి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79కి పెరిగింది. స్విస్‌ బ్యాంకులో ఉన్న భారతీయుల నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్నారు. వేశారా? యువతకు ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఏమయ్యాయి? వీటన్నింటిపై తెలంగాణ ప్రజలు భాజపా నేతలను నిలదీయాలి’’ అ ని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు