TS News: భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలి: కేటీఆర్‌

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలపై మంత్రి కేటీఆర్‌, హరీశ్‌రావు స్పందించారు. ఫలితాలు వెలువడిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ. 20 ఏళ్లలో తెరాస ఎన్నో ఆటుపోట్లు చవిచూసిందన్నారు.

Updated : 24 Sep 2022 17:11 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలపై మంత్రి కేటీఆర్‌, హరీశ్‌రావు స్పందించారు. ఫలితాలు వెలువడిన అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ. 20 ఏళ్లలో తెరాస ఎన్నో ఆటుపోట్లు చవిచూసిందన్నారు. స్ఫూర్తిదాయకంగా పోరాడిన గెల్లు శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.  హుజూరాబాద్‌ ఎన్నికకు అంతగా ప్రాధాన్యం లేదని, ఉప ఎన్నిక ఫలితంతో ఒరిగేదేమీ లేదన్నారు. హుజూరాబాద్‌ ఎన్నిక కోసం శ్రమించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజా తీర్పును శిరసా వహిస్తాం: హరీశ్‌రావు
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును శిరసాహిస్తామన్నారు.  ‘‘భాజపా, కాంగ్రెస్‌ కుమ్మక్కును ప్రజలు గమనిస్తున్నారు. ఒక్క ఓటమితో తెరాస కుంగిపోదు. ఓడినా గెలిచినా తెరాస ప్రజల పక్షాన పనిచేస్తుంది. తెరాసకు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు. తెరాసకు ఓట్లేమీ తగ్గలేదు. ఎక్కడా లేని విధంగా భాజపా, కాంగ్రెస్‌ చేతులు కలిపాయి’’ అని హరీశ్‌రావు ఆరోపించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు