KTR: పార్టీ పేరును భాజపా మార్చుకోవాలి: కేటీఆర్‌ మరో వ్యంగ్యాస్త్రం

భాజపాపై మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఈనెల 15లోపు వస్తుందంటూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ పేర్కొన్న నేపథ్యంలో వ్యంగ్యాస్త్రంతో కూడిన ట్వీట్‌ చేశారు. 

Updated : 02 Oct 2022 14:52 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికపై భాజపా కోర్‌ కమిటీ సమావేశమైన నేపథ్యంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఘాటు విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఈనెల 15లోపు వస్తుందంటూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ పేర్కొన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తనదైన శైలిలో మరో వ్యంగ్యాస్త్రంతో కూడిన ట్వీట్‌ చేశారు. 

‘‘ఎలక్షన్‌ కమిషన్‌కు ముందే భాజపా నేతలు ఎన్నికల తేదీని ప్రకటిస్తున్నారు. ఈడీ కంటే ముందే సోదాలు చేసే వారి పేర్లు చెబుతున్నారు. ఎన్‌ఐఏ కంటే ముందే బ్యాన్‌ విధిస్తున్నారు. ఐటీ అధికారుల కంటే ముందే నగదు వివరాలు చెబున్నారు. సీబీఐ కంటే ముందే నిందితుల పేర్లు వెల్లడిస్తున్నారు. భాజపా తమ పార్టీ పేరును ‘BJ..EC-CBI-NIA-IT-ED..P’గా మార్చుకోవాలి’’ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.
 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts