KTR: విషయం లేనోళ్లను విశ్వసిస్తే.. వినాశనం గ్యారెంటీ: కేటీఆర్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చేసిన పలు కీలక వాగ్దానాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్‌ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహంతో కూడుకున్నవని విమర్శించారు.

Updated : 18 Sep 2023 15:11 IST

హైదరాబాద్:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ చేసిన పలు కీలక వాగ్దానాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కాంగ్రెస్‌ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహంతో కూడుకున్నవని విమర్శించారు. కాంగ్రెస్‌ కపట కథలు బాగా తెలిసిన తెలంగాణ గడ్డ ఇదని చెప్పారు. 

‘‘రాబందుల రాజ్యమొస్తే.. రైతుబంధు రద్దవడం గ్యారెంటీ. కాలకేయుల కాలం వస్తే.. కరెంట్‌ కోతలు.. కటిక చీకట్లే. దగాకోరుల పాలనొస్తే.. ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ. బకాసురులు గద్దెనెక్కితే.. రైతుబీమా గల్లంతవ్వడం గ్యారెంటీ. స్కాముల పార్టీని స్వాగతిస్తే.. స్కీముల ఎత్తివేత గ్యారెంటీ. దొంగల చేతికి తాళాలు ఇస్తే.. సంపద స్వాహా గ్యారెటీ. విషయం లేనోళ్లను విశ్వసిస్తే.. వినాశనం గ్యారెంటీ. ’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని