KTR: క్షమాపణలు చెబుతారా?.. రూ.100 కోట్లు చెల్లిస్తారా?: మంత్రి కేటీఆర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు.రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు.
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు.
‘‘తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే నా పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న నా పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతో బండి సంజయ్, రేవంత్ రెడ్డి పదే పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నంత మాత్రాన ఎదుటి వారిపై అసత్య ఆరోపణలు చేసే హక్కు వారికి లేదు. ఐపీసీ సెక్షన్లు 499, 500 ప్రకారం పరువు నష్టం దావాకు నోటీసులు పంపించా. ఎలాంటి ఆధారాలు లేని సత్యదూరమైన ఆరోపణలు మానుకోవాలి. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉప సంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో రూ.100 కోట్లకు పరువు నష్టం దావాను ఎదుర్కోవాలి’’ అని కేటీఆర్ వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Railway Jobs: రైల్వే శాఖలో 3.12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి: వినోద్ కుమార్
-
World News
Lady Serial Killer: చేయని నేరాలకు ‘సీరియల్ కిల్లర్’గా ముద్ర.. 20 ఏళ్లకు క్షమాభిక్ష!
-
General News
Garbage Tax: చెత్తపన్ను ప్రజలు కడుతుంటే.. మీడియాకు ఇబ్బందేంటి?: శ్రీలక్ష్మి
-
Politics News
Vizag: అర్జీలకే దిక్కులేనప్పుడు ‘జగనన్నకు చెబుదాం’ ఎందుకు?: అయ్యన్న పాత్రుడు
-
General News
Andhra News: వ్యాను బోల్తా.. నేలపాలైన 200 కేసుల బీర్లు
-
General News
Andhra News: కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ పర్యటన వాయిదా