KTR: వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకోవడం తప్పా?: కేటీఆర్‌

సీఎం కేసీఆర్‌ రైతు కుటుంబం నుంచి వచ్చినందునే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తమ

Updated : 10 May 2022 16:49 IST

కామారెడ్డి: సీఎం కేసీఆర్‌ రైతు కుటుంబం నుంచి వచ్చినందునే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సులువైనవే అయితే 60 ఏళ్లుగా దేశాన్ని పాలించినవాళ్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలంలో పర్యటించిన కేటీఆర్‌.. కోనాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి సీసీ రోడ్లు, బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు.

‘మన ఊరు- మనబడి’ కార్యక్రమంలో భాగంగా తన నానమ్మ జ్ఞాపకార్థం సొంత ఖర్చులతో పాఠశాలను నిర్మించనున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా తన పూర్వీకులతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. వందల ఎకరాలున్న కుటుంబంలో కేసీఆర్‌ పుట్టారని చెప్పారు. కొందరు మాత్రం ఆయన్ను ఫాంహౌజ్‌ సీఎం అంటున్నారని.. వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకోవడం తప్పా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. పర్యటనలో భాగంగా తమ పూర్వీకుల ఇంటిని కేటీఆర్‌ సందర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని