Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్‌

డీలిమిటేషన్‌  తర్వాత దక్షిణాదిలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 25 Sep 2023 20:18 IST

హైదరాబాద్: పునర్విభజన (డీలిమిటేషన్‌)పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను కేంద్రం వినాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. దక్షిణాదిలో సీట్లు తగ్గితే బలమైన ప్రజా ఉద్యమం వస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలంతా భారతీయులుగా, ఉత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాల వాసులుగా గర్వపడుతున్నారని అన్నారు. పార్లమెంట్‌ దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదికనీ, దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదని కేటీఆర్‌ తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలను వింటుందని, న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఏమిటీ డీలిమిటేషన్‌?

జనాభా ప్రాతిపదికన..దేశంలో, రాష్ట్రాల్లో చట్టసభల నియోజకవర్గాల సంఖ్య, పరిధులను నిర్ణయించే ప్రక్రియే డీలిమిటేషన్‌. సులభంగా చెప్పాలంటే ఆయా రాష్ట్రాల్లోని జనాభాకు సరైన ప్రాతినిధ్యం లభించేలా పార్లమెంటులో, అసెంబ్లీల్లో సీట్లుండేలా చూసే ప్రక్రియ. అంటే మారుతుండే జనాభాను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకునేలా మన రాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటు ఇది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని