KTR: మోదీకి విజన్‌ కొరతే అన్ని సమస్యలకు మూలం: కేటీఆర్‌

కేంద్రం, ప్రధాని నరేంద్రమోదీపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు.

Published : 02 May 2022 11:52 IST

హైదరాబాద్‌: కేంద్రం, ప్రధాని నరేంద్రమోదీపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. రోజూ ట్విటర్‌ వేదికగా కేంద్రం విధానాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆయన.. తాజాగా మరో ట్వీట్‌ చేశారు. భాజపా పాలనలో బొగ్గు, ఆక్సిజన్‌, ఉద్యోగాలు, కరెంట్‌, ఉపాధి, నిధులకు కొరత ఏర్పడిందని ఆక్షేపించారు. 

‘‘భాజపా పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్‌ కొరత, పరిశ్రమలకు కరెంట్‌ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత..అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోదీకి విజన్‌ కొరత ’’ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఈ మేరకు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని