kuna Ravikumar: తెదేపా నేత కూన రవికుమార్‌ అరెస్ట్‌

 తెదేపా నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Updated : 21 Nov 2021 05:46 IST

శ్రీకాకుళం: తెదేపా నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల పట్ల దుర్భాషలాడారని శనివారం అర్ధరాత్రి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళంలో శాంతినగర్‌ కాలనీలో తన సోదరుడి ఇంట్లో నిద్రపోతున్న ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ సమయంలో పోలీసులు భయబ్రాంతులకు గురిచేసినట్లు రవికుమార్‌ సోదరుడు ఆరోపించారు. రవికుమార్‌ను ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని