
Published : 14 Mar 2021 19:03 IST
జేడీయూలో ఆర్‌ఎల్‌ఎస్పీ విలీనం
పట్నా: బిహార్‌లోని అధికార జేడీయూలో ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) విలీనం అయ్యింది. జేడీయూ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కుష్వాహాను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీని విలీనం చేసిన వెంటనే కుష్వాహాను జేడీయూ జాతీయ పార్లమెంటరీ బోర్డు ప్రెసిడెంట్‌గా నీతీశ్ నియమించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంతో జేడీయూ నుంచి ఉపేంద్ర కుష్వాహా 2007లో బహిష్కరించారు. రెండేళ్ల తర్వాత పార్టీలో తిరిగి చేర్చుకుని రాజ్యసభ సీటు ఇచ్చారు. 2013లో పార్టీ వీడిన కుష్వాహా సొంతంగా ఆర్‌ఎల్‌ఎస్పీని స్థాపించారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి పార్టీలో చేరారు.
ఇవీ చదవండి
Tags :