KVP: జగన్‌కు ఎందుకు దూరమయ్యానో త్వరలోనే చెప్తాను : కేవీపీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి దగ్గరగా ఉన్న తాను.. జగన్‌కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పనని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు.

Updated : 01 Apr 2023 15:16 IST

విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి దగ్గరగా ఉన్న తాను.. జగన్‌కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పనని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈ ప్రశ్నల నుంచి ఎంతో కాలం దూరం జరగలేనన్న ఆయన.. ఏదో ఒకరోజు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఒకరోజు ప్రెస్‌మీట్‌ పెట్టి అన్నీ వివరిస్తానని తెలిపారు. అదానీ సంపద గురించి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే.. దేశ ద్రోహమా అని నిలదీశారు. రాహుల్​కు జరిగిన అన్యాయంపై కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా స్పందించారని.. ఒక్క ఏపీ మినహా అంటూ విమర్శించారు. అయితే తాము చేసే పోరాట కార్యక్రమాలను అణచివేయవద్దని జగన్‌కు విజ్ఞప్తి చేశారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు