Kiren Rijiju: ‘ముందు మీ రక్షణశాఖ మంత్రి ఏం అన్నారో వినండి’

భారత్‌- చైనా సరిహద్దు వివాదంపై అమెరికా నివేదికను ఉటంకిస్తూ కాంగ్రెస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. దేశ రక్షణ వ్యవస్థ విషయంలో 2013లో అప్పటి...

Published : 07 Nov 2021 20:39 IST

కాంగ్రెస్‌ నేతలపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ప్రతిదాడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌- చైనా సరిహద్దు వివాదంపై అమెరికా నివేదికను ఉటంకిస్తూ కాంగ్రెస్‌ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. దేశ రక్షణ వ్యవస్థ విషయంలో 2013లో అప్పటి రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ లోక్‌సభలో మాట్లాడిన వీడియోనూ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ‘కాంగ్రెస్ సభ్యుల్లారా.. చైనా సరిహద్దు విషయంలో మాట్లాడే ముందు మీ హయాంలోని రక్షణశాఖ మంత్రి మాట వినండి’ అని ట్వీట్ చేశారు. ‘అభివృద్ధి చెందిన సరిహద్దుల కంటే అభివృద్ధి చెందని సరిహద్దులే సురక్షితం అనే విధానాన్ని భారత్‌ ఏళ్లుగా పాటిస్తోంది. మరోవైపు సరిహద్దులో చైనా తన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది’ అంటూ ఆంటోని చేసిన వ్యాఖ్యలు ఆ వీడియోలో ఉన్నాయి.

‘మన సైన్యాన్ని నమ్మడం లేదు కానీ..’

‘అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందని ఓ విదేశీ నివేదిక పేర్కొంది. కానీ.. ఆ నివేదికలోనే 1959లో చైనా ఆక్రమించిన ప్రాంతంలో అని రాసి ఉంది. మీరు కావాలనే మన సైన్యాన్ని నమ్మడం లేదు. కానీ.. దేశాన్ని నిరుత్సాహపరిచే దురుద్దేశంతో ప్రభుత్వ విశ్వసనీయతను, సైన్యం సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్న ఓ కథనాన్ని పట్టించుకుంటున్నారు’ అని కాంగ్రెస్‌ శ్రేణులను ఉద్దేశించి రిజిజు విమర్శలు చేశారు. అమెరికా నివేదికను ఉటంకిస్తూ.. కాంగ్రెస్‌ నేతలు శనివారం కేంద్రంపై విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. గతంలో చైనాకు ఇచ్చిన ‘క్లీన్ చిట్’ను ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి డిమాండ్‌ చేశారు. ఈ విషయమై క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని