గృహిణులందరికీ పింఛన్‌

కేరళలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమి ప్రజలపై హామీల వర్షం కురిపించింది. గృహిణులందరికీ పింఛన్‌, యువతకు 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని...

Published : 19 Mar 2021 21:26 IST

కేరళలో ఎల్డీఎఫ్‌ ఎన్నికల మేనిఫెస్టో

తిరువనంతపురం: కేరళలో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమి ప్రజలపై హామీల వర్షం కురిపించింది. గృహిణులందరికీ పింఛన్‌, యువతకు 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. పింఛన్‌ హామీకి సంబంధించి పూర్తి విరాలను మాత్రం తెలియజేయలేదు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి విజయ్‌ రాఘవన్‌ మేనిఫెస్టోను శుక్రవారం  విడుదల చేశారు. సీపీఐ కార్యదర్శి కన్నన్‌ రాజేంద్రన్‌, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఇస్తున్న సామాజిక పింఛన్లను దశలవారీగా రూ.2,500కు పెంచుతామని ఎల్డీఎఫ్‌ తన మేనిఫెస్టోలో పేర్కొంది. లైఫ్‌ మిషన్‌ ప్రాజెక్ట్‌ కింద పేదలందరికీ మరిన్ని ఇళ్లు కట్టిస్తామని, ఎస్సీ, ఎస్టీలందరికీ నివాస సముదాయాలు కట్టిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతాలు కోతకు గురి కాకుండా రూ.5వేల కోట్లతో కోస్టల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ ప్యాకేజీని ప్రకటిస్తామని పేర్కొంది. రబ్బర్‌కు మద్దతు ధరను కేజీకి రూ.250కి పెంచుతామని హామీ ఇచ్చింది. రాష్ట్రానికి సరిపడా గుడ్లు, పాలు, కూరగాయల విషయంలో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొంది. ఐదేళ్లలో అవినీతి రహిత  పాలన అందించడం ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా ఈ సందర్భంగా విజయ్‌ రాఘవన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని