AP News: గుడివాడలో క్యాసినో ఆరోపణలు.. చంద్రబాబుకు నిజనిర్ధారణ కమిటీ నివేదిక

గుడివాడలో క్యాసినో ఆరోపణల వ్యవహారంలో తెదేపా నిజ నిర్ధారణ కమిటీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదిక అందజేసింది.

Published : 24 Jan 2022 15:13 IST

అమరావతి: గుడివాడలో క్యాసినో ఆరోపణల వ్యవహారంలో తెదేపా నిజ నిర్ధారణ కమిటీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదిక అందజేసింది. సంక్రాంతి పండుగ వేళ గుడివాడలో క్యాసినో, జూదం, పేకాట, అసభ్యకర నృత్యాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని నేతలు నివేదికలో పేర్కొన్నారు. రూ.500 కోట్లు చేతులు మారాయని వెల్లడించారు. మంత్రి కొడాని నానికి చెందిన కె కన్వెన్షన్‌లో క్యాసినో నిర్వహించారని ఆరోపిస్తూ తెదేపా నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలో పరిశీలనకు వెళ్లింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పర్యటన అనంతరం నివేదిక రూపొందిన కమిటీ సభ్యులు ఇవాళ చంద్రబాబుకు దాన్ని అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని