Minister Sitakka: కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీసులు

భారాస అధికారిక సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్‌ నోటీసులు పంపారు.

Published : 06 Jul 2024 03:48 IST

తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక

ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి: భారాస అధికారిక సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క శుక్రవారం లీగల్‌ నోటీసులు పంపారు. సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడుతూ.. ఇష్టారీతిన పోస్టులు పెడుతూ తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నందుకు లాయర్‌ ద్వారా కేసీఆర్‌కు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. ‘‘ములుగు ప్రాంతంలోని గోదావరిలో ప్రభుత్వ అనుమతులతోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులే కొనసాగుతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై మా ప్రభుత్వం కేసులు నమోదు చేస్తూ చర్యలు తీసుకుంటోంది. నిరాధారమైన వీడియో పోస్టులతో దుష్ప్రచారం చేస్తుండడంపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. లేకుంటే రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేస్తా’’ అని సీతక్క నోటీసులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని