Updated : 27 Jun 2022 20:42 IST

Loan apps: వద్దన్నా లోన్‌లు.. ‘నగ్న ఫొటో’లతో వేధింపులు!

హైదరాబాద్‌: రుణ యాప్‌ల (Loan apps) కేసుల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. గతంలో రుణాలు తీసుకున్న వారి డేటాను సేకరించి మళ్లీ వారికి అవసరం లేకున్నా ఖాతాల్లో నగదు జమ చేసి తిరిగి కట్టాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. గతంలో రుణగ్రహీతల బంధువులు, స్నేహితులకు ఫోన్లు మాత్రమే చేసి వేధించిన నిర్వాహకులు ఈసారి రూటు మార్చారు. బాధితుల ఫోన్‌లోని కాంటాక్టులను సేకరించి స్నేహితులతో యువతుల డీపీలు పెట్టి వాట్సాప్‌ చాటింగ్‌ చేస్తూ వారికి నగ్న ఫోటోలు పంపుతున్నారు. వాటిని స్క్రీన్‌షాట్‌ తీసి మీ స్నేహితుడు డబ్బు కట్టలేదని.. మీరు కట్టాలంటూ వారిని వేధిస్తున్నారు. 

ఒకవేళ కట్టకపోతే ఈ స్క్రీన్‌షాట్‌లను సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ వారిని భయపెడుతున్నారు. దీంతో కొందరు రుణగ్రహీతల స్నేహితులు ఈ వేధింపులు తట్టుకోలేక డబ్బు కట్టినవారూ ఉన్నారు. హైదరాబాద్‌ మహా నగరంలోని మూడు పోలీస్‌ కమిషనరేట్‌ల పరిధిలో రుణ యాప్‌ల కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 90కి పైగా కేసులు నమోదు కాగా.. సైబరాబాద్‌లో 80కి పైగా, రాచకొండ పరిధిలో 30కి పైగా కేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో కీలక నిందితులు నేపాల్‌లో దాక్కున్నట్టు తేలింది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. 

221 రుణ యాప్‌లు తొలగించాలని గూగుల్‌కు లేఖ

మరోవైపు, సైబర్‌ క్రైం పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు. 221 రుణ యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. రుణయాప్‌ల కీలక నిందితురాలు క్యూయానియన్‌ చైనాలో ఉండగా.. ఇప్పటివరకు రుణ యాప్‌ కేసుల్లో 35మంది పోలీసులు అరెస్టు చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని