BRS: తెరాస భారాసగా మారినా గుర్తింపు ఇవ్వని లోక్‌సభ సచివాలయం

తెరాస భారాస(BRS)గా మారినా లోక్‌సభ సచివాలయం గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ నుంచి తెరాసను తొలగించింది.

Published : 01 Mar 2023 12:57 IST

దిల్లీ: తెరాస భారాస(BRS)గా మారినా లోక్‌సభ సచివాలయం గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ నుంచి తెరాసను తొలగించింది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు బీఏసీ సభ్యుడిగా ఉన్నారు. ఇవాళ్టి సమావేశానికి ఆయన్ను ఆహ్వానితుడిగానే లోక్‌సభ సచివాలయం ఆహ్వానం పంపింది. 

ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులున్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఉంటుంది. తెరాసకు లోక్‌సభలో 9 మంది సభ్యులున్నా లోక్‌సభ సచివాలయం తొలగించింది. లోక్‌సభ బీఏసీలో ఇకపై ఆహ్వానిత పార్టీగానే తెరాస కొనసాగనుంది. ఆహ్వానం పంపితేనే భేటీకి హాజరుకావాల్సి ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని