Lokesh: వివేకా హత్య కేసులో అవినాశ్‌ పాత్ర స్పష్టమవుతున్నా.. జగన్‌ మౌనమేల?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్ర స్పష్టమవుతున్నా.. సీఎం జగన్‌ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి

Updated : 04 Mar 2022 18:42 IST

మంగళగిరి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్ర స్పష్టమవుతున్నా.. సీఎం జగన్‌ ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. పరిస్థితి చూస్తుంటే వివేకా హత్యకు జగనే కుట్ర చేసినట్టు అనిపిస్తోందన్నారు. అందువల్ల జగన్‌ను కూడా సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. అమరావతిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినందున ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని సూచించారు. మంగళగిరిలో ఇటీవల మృతిచెందిన తెదేపా కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు. కార్యకర్తల కుటుంబాలకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని