Updated : 28 May 2022 20:01 IST

TDP Mahanadu: జగన్‌ది కేవలం ‘మందు’ చూపు మాత్రమే: లోకేశ్‌

ఒంగోలు: తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని అనుకున్నవారంతా గాలిలో కలిసి పోయారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. తెదేపా పునాదులు గట్టిగా ఉన్నాయని.. ఎవరూ ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు శివారు మండువవారిపాలెంలో మహానాడు వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన లోకేశ్‌.. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్‌ ధరల్లో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉందన్నారు. చెత్త పన్ను, ఇసుక ధరల్లో ఏపీ దూసుకెళ్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విషయంలో సీఎం జగన్‌కు ఎలాంటి ముందు చూపు లేదని.. కేవలం మందు చూపు మాత్రమే ఉందని విమర్శించారు. శవాన్ని అడ్డం పెట్టుకొని వైకాపా రాజకీయాలు చేస్తోందని లోకేశ్‌ మండిపడ్డారు.

తెదేపాకు 160 సీట్లు ఖాయం: అచ్చెన్నాయుడు

‘‘2019లో తెలిసో, తెలియకో ప్రజలు తప్పు చేశారు. చంద్రబాబును ఓడించటం ప్రజలు చేసిన తప్పు. రూ.లక్షల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించారు. ఈ మూడేళ్లలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే అంత ఈజీ కాదు. మళ్లీ చంద్రబాబును గెలిపిస్తేనే.. రాష్ట్రం గాడిన పడుతుంది. హత్యలు చేసిన వైకాపా నేతలు అమలాపురంలో అల్లర్లు సృష్టించారు. మూడేళ్లుగా తెదేపా కార్యకర్తలు బయటకు రావాలంటే, నాయకులు మాట్లాడాలంటే భయపడ్డారు. మహానాడు ప్రభంజనం చూస్తుంటే... వచ్చే ఎన్నికల్లో తెదేపా 160 స్థానాల్లో విజయం సాధిస్తుంది. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు’’ అని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని