Chandra babu Arrest: ప్రజల ఫోన్లలో వాట్సాప్‌ డేటా తనిఖీ చేయడం దుర్మార్గమైన చర్య: లోకేశ్‌

ఉత్తరకొరియా అణచివేత పాలన తరహాలో ఏపీ పరిస్థితులు ఉన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

Published : 24 Sep 2023 16:36 IST

దిల్లీ: ఉత్తరకొరియా అణచివేత పాలన తరహాలో ఏపీ పరిస్థితులు ఉన్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని ఆపడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. ప్రజల ఫోన్లలో వాట్సాప్ డేటా సైతం తనిఖీ చేయడం దుర్మార్గమైన చర్య అని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతటి క్లిష్టపరిస్థితుల్లో నైనా వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించరాదనే నిబంధనలు పోలీసులు అతిక్రమించారని లోకేశ్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని