Ap news: మహిళలపై అరాచకాలకు కేరాఫ్‌గా ఏపీ :లోకేశ్‌

మహిళలపై అరాచ‌కాల‌కు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ విమర్శించారు. గుంటూరులో మూర్ఖుడి

Updated : 20 Aug 2021 15:21 IST

అమరావతి: మహిళలపై అరాచ‌కాల‌కు ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ విమర్శించారు. గుంటూరులో మూర్ఖుడి దాడికి మొన్న ర‌మ్య నేల‌కొరిగితే..నిన్న గుంటూరు జిల్లా రాజుపాలెంలో చిన్నారి అఘాయిత్యానికి గురైందన్నారు. ఇవాళ విజ‌య‌న‌గ‌రం జిల్లా చౌడ‌వాడ‌లో ఉన్మాది పెట్రోల్ పోసి యువ‌తిని త‌గుల‌బెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా అమానవీయ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని లోకేశ్‌ మండిపడ్డారు. సీఎం ఇంటికి సమీపంలో ఉన్నవారూ అత్యాచారానికి గుర‌య్యారని ఆరోపించారు. వైకాపా పాల‌న‌లో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భ‌ద్రత‌లేదని, భయం భయంగా బతుకుతున్నారని దుయ్యబట్టారు. లేని ఆ దిశ చ‌ట్టం...రక్షించ‌లేని దిశ‌యాప్ పేరుతో ప్రచారం చేయడం సిగ్గు చేటని విమర్శించారు. నిందితుల్ని ప‌ట్టుకుని శిక్షించ‌డంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఆడ‌పిల్లల ఉసురు త‌గిలితే వైకాపాకు, ఈ రాష్ట్రానికి మంచిది కాదని లోకేశ్‌ హితవు పలికారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని