
Published : 28 Jan 2022 20:47 IST
Telangna : ఎంపీ అర్వింద్‌కు స్పీకర్ ఓం బిర్లా ఫోన్ !
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఫోన్ చేశారు. ఆర్మూర్‌లో తనపై జరిగిన దాడి, పోలీసుల తీరు గురించి స్పీకర్‌కు వివరించినట్లు అర్వింద్ తెలిపారు. పోలీసుల సాయంతో ప్రభుత్వమే హత్యాయత్నం చేసిందని బిర్లాకు వివరించారు. వెంటనే దిల్లీకి రావాలని స్పీకర్ చెప్పారని, రెండు రోజుల్లో దిల్లీ వెళ్లి ఆయనకు ఫిర్యాదు చేస్తానని ఎంపీ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గత మంగళవారం భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ వాహనంపై తెరాస శ్రేణులు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. నందిపేట్ మండలం నూత్‌పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తుండగా ఆర్మూర్ మండలం ఇస్సపల్లి సమీపంలో జరిగిన దాడిలో అర్వింద్ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
Tags :