
Published : 22 May 2021 01:30 IST
Raghurama అంశంపై నివేదిక కోరిన స్పీకర్!
దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును సభాహక్కుల కమిటీకి పంపారు. రఘురామ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని హోంశాఖను స్పీకర్ కార్యాలయం కోరింది. రఘురామ కుటుంబీకుల ఫిర్యాదు కాపీని హోంశాఖకు పంపింది. ఎంపీ రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు పెట్టి సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు గురువారం లోక్‌సభ సభాపతి ఓం బిర్లాను కలిసిన విషయం తెలిసిందే. ఎంపీ సతీమణి రమ, కుమారుడు భరత్, కుమార్తె ఇందు ప్రియదర్శిని ఆయనను కలిసి రఘురామ అరెస్టు, కస్టడీలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేశారు. అంతకు ముందురోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కూడా కలిసి, అరెస్టు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
Advertisement
Tags :