Maharashtra: షిందే-భాజపా సర్కార్‌లో అంతర్గత పోరు?

మహారాష్ట్ర (Maharashtra) సీఎం ఏక్‌నాథ్‌ షిందే (Eknath Shinde) కుమారుడు, ఎంపీ శ్రీకాంత్‌ షిందే (Shrikanth Shinde) సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార కూటమికి కొందరు నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నట్లు భాజపా నేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. 

Updated : 10 Jun 2023 14:38 IST

సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్‌ షిందే

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లో అధికారంలో ఉన్న షిందే-భాజపా (Shivasena-Bjp) కూటమిలో అంతర్గత పోరు మొదలైనట్లు తెలుస్తోంది. స్వప్రయోజనాల కోసం కొందరు నాయకులు ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ భాజపా నేతలను ఉద్దేశించి రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిందే (Eknath Shinde) కుమారుడు ఎంపీ శ్రీకాంత్‌ షిందే (Srikanth Shinde) తీవ్ర ఆరోపణలు చేశారు.

‘‘రాష్ట్రంలోని డోంబివిల్‌ ప్రాంతానికి చెందిన కొందరు నాయకులు వారి రాజకీయ లబ్ధి కోసం శివసేన-భాజపా కూటమికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ కూటమిని కొనసాగిస్తూ రాబోయే ఎన్నికల్లోనూ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మా పనిని ఎవరైనా వ్యతిరేకించినా.. అడ్డంకులు  సృష్టించినా నా పదవికి నేను రాజీనామా చేస్తా. నాకు పదవులపై వ్యామోహం లేదు. నా స్థానంలో కూటమి సీనియర్‌ నాయకుల నిర్ణయం మేరకు ఎవరిని తీసుకొచ్చినా వైదొలుగుతా’’అని శ్రీకాంత్‌ జాతీయ మీడియాకు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో శివసేన- భాజపా కలిసి పోటీ చేస్తాయని సీఎం ఏక్‌నాథ్‌ షిందే ఇటీవల ప్రకటించారు. దేశంలో మహారాష్ట్రను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నంబర్‌ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆ ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే శ్రీకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని