Cabinet: ఆగస్టు 15కు ముందే ‘మహా’ కేబినెట్‌ విస్తరణ.. హోంశాఖ ఆయనకేనట?

భాజపా సహకారంతో మహారాష్ట్ర పీఠం దక్కించుకున్న సీఎం ఏక్‌నాథ్‌ శిందే (eknath shindhe) తన మంత్రివర్గ విస్తరణకు తీవ్ర కసరత్తులు .....

Published : 08 Aug 2022 02:19 IST

ముంబయి: భాజపా సహకారంతో మహారాష్ట్ర పీఠం దక్కించుకున్న సీఎం ఏక్‌నాథ్‌ శిందే (eknath shindhe) తన మంత్రివర్గ విస్తరణకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. కనీసం 15 మంది మంత్రులతో ఈ వారంలోనే కేబినెట్‌ విస్తరించనున్నారని సమాచారం. కీలక హోంశాఖను డిప్యూటీ సీఎం, భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఓబీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో ఉండటంతో రాష్ట్రంలో జరగాల్సిన పురపాలిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

శివసేన నుంచి తిరుగుబావుటా ఎగురవేసిన తర్వాత భాజపా సహకారంతో ఏక్‌నాథ్‌ శిందే జూన్‌ 30న ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా శిందే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌లతో గవర్నర్‌ కోశ్యారీ ప్రమాణస్వీకారం చేయించారు. ఇద్దరితోనే కేబినెట్‌ నడుస్తోందంటూ ఎన్సీపీ నేత అజిత్ పవార్‌తో పాటు ప్రతిపక్షాలనుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. దీనిపై ఫడణవీస్‌ స్పందిస్తూ.. ప్రతిపక్ష నేత అజిత్‌ పవార్‌ కూడా తమకు చెబుతున్నారని.. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు తొలి 32 రోజులు కేవలం ఐదుగురు మంత్రులు మాత్రమే ఉన్న విషయాన్ని ఆయన మర్చిపోయారా? అని ప్రశ్నించారు. మీరు ఊహించినదానికన్నా ముందే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.  అయితే, ఆగస్టు 15 కన్నా ముందే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని