Published : 08 Jul 2022 02:22 IST

Maharashtra: శిందే వర్గానికి 13.. భాజపాకు 25..!

మహారాష్ట్రలో కొలువుదీరనున్న కొత్తమంత్రి వర్గం

ముంబయి: మహారాష్ట్రలో కొత్తగా కొలువుదీరిన భాజపా-శివసేన(అసమ్మతి) కూటమి మంత్రిత్వ శాఖల కేటాయింపులకు రంగం సిద్ధం చేస్తోంది. మొత్తం 45 మంది మంత్రులు బాధ్యతలు తీసుకోనున్నట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. భాజపాకే ఎక్కువ శాఖలు దక్కనున్నట్లు పేర్కొన్నాయి. 

భాజపా నుంచి 25 మంది, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గం నుంచి 13 మంది మంత్రి పదవులు చేపట్టనున్నారు. స్వతంత్రులకు కూడా అవకాశం లభించనుందని ఆ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మినహా దాదాపుగా కొత్తవారికే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తదుపరి మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొత్తవారి పనితీరును పరీక్షించాలని భాజపా భావిస్తున్నట్లు చెప్పాయి. 

శివసేన పార్టీలో శిందే వర్గం అసమ్మతి రాజేయడంతో.. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ(కాంగ్రెస్‌, శివసేన, ఎన్‌సీసీ కూటమి) ప్రభుత్వం కూలిపోయింది. సుమారు 10 రోజులు ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగింది. చివరకు భాజపా మద్దతుతో శిందే వర్గం అధికారంలోకి వచ్చింది. అనూహ్య పరిణామాల మధ్య ఆయన ఏక్‌నాథ్‌ శిందే ముఖ్యమంత్రి అయ్యారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని